గవర్నర్ ప్రసంగం బుక్ లో పచ్చి అబద్దాలు రాశారని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు పథకం హామీలో భాగంగా 7వేల కోట్లు బాకీ పడ్డారు. విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి సుమారు 72వేలు బాకీ పడ్డారు. దత్త పుత్రుడితో కలిసి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే అన్నారు. నిరుద్యోగులకు 3వేల భృతి ఇస్తామని చెప్పారు.
వైసీపీ హయాంలో 40లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆధార్ కార్డుతో సహా చూపిస్తామన్నారు జగన్. రెండు బడ్జెట్ లలోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. చంద్రబాబు ఏది చెప్పినా అది అబద్దం అన్నారు. జగన్ చెప్పిన దాని కంటే ఎక్కువ చేస్తున్నామని ఫోజులు ఇస్తున్నారు. తొలి బడ్జెట్ లో పథకాలకు కేటాయించింది బోడీ సున్నా. సోషియో ఎకానమిక్ సర్వేలో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు జగన్.