82 ఏళ్ళ బామ్మ… కాశీలో అన్నపూర్ణ అయింది…!

-

కరోనా దెబ్బకు చాలా మందికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వేలాది మంది రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేదు వాడుకోవడానికి డబ్బులు లేవు. ఇలా ఏ విధంగా చూసినా సరే పరిస్థితి భయపెడుతుంది. దీనితో ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ పేదలకు పట్టెడు అన్నం పెడుతున్నారు. లేని వాళ్లకు మేము అండగా ఉన్నామని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వారణాసిలో విమలా దివాన్ అనే 82 ఏళ్ళ బామ్మ స్కూల్ టీచర్ గా రిటైర్ అయ్యారు. ఇన్నాళ్ళు వృత్తి జీవితంలో ఎందరినో తీర్చి దిద్దిన ఆ బామ్మ గారు… తన పెన్షన్ సొమ్ముతో పది మందికి అన్నం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ తో 5 ఏళ్ళు పోరాడిన ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. లాక్ డౌన్ వలన కడుపు నిండని వారి కడుపు నింపాలని భావించిన బామ్మ గారికి… ఆమె కాలని వాసులు కూడా సహకారం అందించారు.

ఒకరు కూరగాయలు కోస్తున్నారు… మరొకరు పెద్ద పాత్రలో అన్నం వండుతుండగా మరొకరు స్వీట్స్ చేస్తున్నారు. ఆమె పూరీలు వేస్తున్నారు. అక్కడ కూలీలకు ఆమె అండగా నిలిచారు. అందరికి అన్నం పెడుతున్నారు. ఎవరూ కూడా పస్తులు పడుకోవద్దు అనేది తన ఉద్దేశం అన్నారు ఆమె. క్యాన్సర్‌నే గెలిచిన నేను కరోనాకు భయపడనని ధైర్యంగా చెప్పారు. ఈ ఆపత్కాలంలో నావల్ల అయ్యింది చేస్తా అని ధైర్యంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version