దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి… సరిగా రెండు రోజుల క్రితం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య. లాక్ డౌన్ ప్రకటించిన నాటి కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి లాక్ డౌన్ ని పెంచారు. లాక్ డౌన్ ని కేంద్రం పెంచే యోచనలో ఉంది అనే విషయం ఇప్పటికే స్పష్టంగా అర్ధమైంది. దేశంలో లాక్ డౌన్ సడలిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది.
అందుకే ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించడానికి మొగ్గు చూపించారు. ఏప్రిల్ 30 వరకు దాదాపు చాలా రాష్ట్రాలు పెంచాయి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి మిగిలిన రాష్ట్రాలు. ఇప్పుడు లాక్ డౌన్ ని పొడిగించడం మినహా మరో మార్గం లేదు. ప్రజలు ఏ మాత్రం ఇప్పుడు అలసత్వం గా ఉన్నా సరే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తగా లేకపోతే లాక్ డౌన్ ని మళ్ళీ పెంచే అవకాశాలు ఉంటాయి.
ప్రజల ప్రాణాలు మినహా ఏ ప్రభుత్వానికి ఆర్ధిక అవసరాలు ముఖ్య౦ కాదు. దేశంలో పది వేలకు దగ్గరవుతున్నాయి కరోనా కేసులు. మరణాలు కూడా ఈ నాలుగు రోజుల్లో భారీగా పెరుగుతున్నాయి. మరణాలను కట్టడి చేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు వైద్యులకు ఇదే సవాల్ గా మారింది. మరణాలు పెరిగితే కేసులు పెరుగుతాయి. కాబట్టి కేసులను పూర్తిగా కట్టడి చెయ్యాలి, మరణాలను అంతకు మించి అదుపు చెయ్యాలి. ఈ 14 రోజులు కూడా దేశానికి చాలా కీలకం. కాబట్టి అర్ధం చేసుకుని ఇళ్ళల్లో ఉండటమే మంచిది.