చర్మంపై 9 గంటలు కరోనా వైరస్ ఉంటుంది: సర్వే

-

మనిషి శరీరంపై కరోనా వైరస్ 9 గంటలకు పైగా జీవిస్తుంది అని, మనం శుభ్రం చేసుకోకుండా వదిలేస్తే మాత్రం చాలా ప్రమాదం అని ఒక సర్వే చెప్పింది. కరోనా వైరస్ ప్రసారం ఎక్కువగా ఏరోసోల్స్ మరియు బిందువుల ద్వారా జరుగుతుందని ఇప్పటి వరకు మనకు తెలిసింది. కాని కొత్త సర్వే ప్రకారం చర్మం నుంచి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని కాబట్టి చేతి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం అని చెప్పారు. ఈ ప్రయోగాలలో ఆరోగ్యకరంగా ఉన్న వారిని పరీక్షించారు. వారికి సోకకుండా ఉండటానికి, పరిశోధకులు కాడవర్ స్కిన్ ఉపయోగించారు.

ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ మానవ చర్మంపై రెండు గంటల కన్నా తక్కువ మనుగడ సాగించగా, కరోనా వైరస్ తొమ్మిది గంటలకు పైగా బ్రతికి ఉంది అని గుర్తించారు. 80 శాతం ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్ ద్వారా రెండూ 15 సెకన్లలో పూర్తిగా మరణించాయి అని గుర్తించారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆల్కహాల్ ఆధారిత చేతి శానిటైజర్ లను ఉపయోగించాలని చెప్పింది. 20 సెకన్ల పాటు సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవాలని సిఫారసు చేస్తుంది.

ఇక ఫేస్ మాస్క్ గురించి కూడా సంచలన విషయం చెప్పారు. ఫేస్ మాస్క్ అనేది అసౌకర్యంగా ఉంటుంది గాని… ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారిలో కూడా ఆక్సిజన్ ప్రవాహాన్ని పరిమితం చేసే అవకాశం లేదని స్పష్టం చేసారు. గ్యాస్ ద్వారా ఈ పరిక్షలు చేసారు. రక్తంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ స్థాయిలో ఏ మార్పు లేదు మాస్క్ ధరిస్తే అని స్పష్టం చేసారు. మాస్క్ ధరించాలి అని స్పష్టం చేసారు. చేతులు శుభ్రం చేసుకోవడం అనేది చాలా కీలకం అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version