మగవాళ్ళు తమకంటే పెద్ద వాళ్ళని లైఫ్ పార్ట్నర్ కింద ఎందుకు ఎంచుకుంటారో తెలుసా..?

-

చాలా మంది భార్యా భర్తలుని చూస్తే తమ కంటే కూడా వయసు లో పెద్ద అయిన భార్యని వాళ్లు వివాహం చేసుకుంటారు. మన సెలబ్రిటీస్ లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా నిక్ జోనస్, సైఫ్ అలీఖాన్ అమృతాసింగ్, ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మొదలైనవారు. అయితే ఈ సొసైటీలో ఇది కామన్ కాదు.

 

చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఎందుకు వయసు లో పెద్ద వాళ్ళని వివాహం చేసుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం..

పెద్ద వాళ్లని పార్ట్నర్ కింద మగవాళ్ళు ఎంచుకోవడం వల్ల వాళ్లు మరింత చురుగ్గా ఉంటారు. అదే విధంగా వాళ్ళు ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి.

అలానే ఎక్కువ సేపు గాసిప్స్ చేసుకుంటూ ఉండరు. వాళ్ళకి పనులు ఎలా చేసుకోవాలి, ఫ్రస్ట్రేషన్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్ని కూడా తెలుస్తాయి.

చాలా కాన్ఫిడెంట్ గా మరియు ఎక్కువ సెల్ఫ్ ఎస్టీమ్ తో ఉంటారు. ఏమైనా ఇబ్బందులు వచ్చినా చిటికెలో సాల్వ్ చేసుకోగలుగుతారు.

అదే విధంగా వాళ్ళలో సెక్సువల్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవల్స్ వాళ్ళని రిలేషన్ షిప్ లో బాగుంటే లాగా చేస్తాయి. గౌరవించడం, వాళ్ల పార్టనర్ కోసం సమయం గడపడం లాంటివి చేస్తూ ఉంటారు.

మహిళలు పెద్ద వాళ్ళు అయితే ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. అనవసరమైన డ్రామా లాంటివి వాళ్ళు క్రియేట్ చేయరు. సులువుగా వాళ్ళు ఏదైనా హ్యాండిల్ చేయగలరు.

వాళ్ళ కంటే వయసులో పెద్ద వాళ్ళని వివాహం చేసుకోవడం వల్ల కొత్త విషయాలు కూడా పురుషులు నేర్చుకోగలుగుతారు. దీంతో వాళ్లు నాలెడ్జ్ ని కూడా పెంపొందించుకోగలరు.

వయసులో పెద్దవారు అయిన మహిళలకి కాస్త ఆర్థికంగా కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దీనితో భర్తల పై అంత బరువు పడదు. ఇద్దరు పార్ట్నర్స్ కూడా మెచ్యూర్ గా వుంటే అర్ధం చేసుకోగలరు.
దీనితో రిలేషన్ షిప్ కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version