లాక్ డౌన్ సమయంలో శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తు మరణించిన వలస కార్మికుల వివరాలను ఇటీవలే కేంద్ర రైల్వే శాఖామంత్రి ప్రకటించారు. లాక్ డౌన్ సమయంలో స్వస్థలాలకు వెళ్లే క్రమంలో ఏకంగా 97 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు అంటూ పార్లమెంట్ వేదికగా తెలిపారు. అయితే రాజ్యసభ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళుతూ ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలను అసహజ మరణాలు గా పరిగణించిన పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కూడా చేపట్టారు అంటూ కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా తెలిపారు. అంతేకాకుండా మరణించిన అందరూ వలస కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కూడా నిర్వహించి ఆ వివరాలు సేకరించినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవలే వలస కార్మికులు సంబంధించి ఎలాంటి లెక్కలు లేవనే కేంద్ర ప్రకటనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరాలను తెలిపారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్.