సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. భారీగా కూరగాయల ధరలు పెరిగాయి. సకాలంలో వర్షాలు లేకపోవటంతో దిగుబడి తగ్గటంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. బెండ, వంకాయ, టమోటా, మిర్చి, బంగాళా దుంప ధరలు కిలో 5 నుంచి 6 రూపాయలు పెరిగాయి. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా దొరకని టమోటా, మిర్చి, ఉల్లిపాయలు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వ్యాపారులు.
ఇక అటు చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. స్కిన్ లెస్ చికెన్ కిలో 306 రూపాయలు పలుకుతోంది మార్కెట్ లో… అయినా మాంసాహార ప్రియులు వెనకడుగు వేయడం లేదు… చికెన్ ధర ఇంకా తగ్గాలంటున్నారు దుకాణందారులు.. ఎండలు తగ్గకపోవడంతో బ్రాయిలర్ కోడి త్వరగా చనిపోతుందని, అందుకే డిమాండ్ కు తగిన సప్లై లేకపోవడం ధరలు పెరగడానికి కారణం అని అంటున్నారు.