సొంత జిల్లాలో కేసీఆర్ కు దిమ్మ తిరిగే దెబ్బ…? నలుగురు ఎమ్మెల్యేలు అవుట్…?

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మీద ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సీఎం సొంత జిల్లా మెదక్ లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ సొంత జిల్లా నేతల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి.

అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడానికి సొంత జిల్లా ఎమ్మెల్యేలు రెడీ అయినట్లు సమాచారం. దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఉప ఎన్నికల తర్వాత తమకు ప్రాధాన్యత లేదని భావించిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వారి పనితీరు విషయంలో కూడా సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా సీరియస్ గానే ఉన్నారు.

సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లలేకపోతున్నారు. అందుకే వారి మీద సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది అనేది వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత రానుంది. అయితే సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడానికి కంటే ముందే తాము పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్లు ఇప్పటికే స్పష్టం చేశారట. వారితో మంత్రి హరీష్ రావు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది అనేది కూడా కొంతమంది వాదన.

Read more RELATED
Recommended to you

Exit mobile version