కొన్ని దేశాల్లో కొన్ని వింత ఆచారాలు ఉంటాయి.. అవి వినడానికి కొత్తగా ఉన్నా కూడా థ్రిల్లింగ్గా ఉంటాయి.ముఖ్యంగా గిరిజన తెగల వాళ్ళ పద్దతులు చాలా భిన్నంగా ఉంటాయి.. పుట్టుక నుంచి చావు వరకూ అన్నీ కొత్తగా ఉంటాయి.ముఖ్యంగా శృంగారానికి సంబంధించి వీరు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు ఎంతో చిత్రంగా అనిపిస్తాయి. మీలో ఉత్కంఠతను కూడా రేకెత్తిస్తాయి. కొన్ని వందలు, వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఇటువంటి ఆచారాల్లో వాయు తెగ నృత్య సాంప్రదాయం ఒకటి.
కొలంబియా, వెనిజులా ప్రాంతాలలో ఎడారిలో సుమారు 10,800 చదరపు కిలోమీటర్లలో వాయు తెగ ప్రజలు విస్తరించి ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో సుమారు 5 లక్షలకు పైగా వాయు తెగ ప్రజలు నివసిస్తున్నట్లు అంచనా. వీరంతా చిన్న వివిక్త సమాజాల్లో నివసిస్తున్నారు. మేకలు, ఆవులు మరియు పంటల మిశ్రమాన్ని నివారించడానికి వీరు చిన్న చిన్న సమాజాలుగా నివసిస్తుంటారు. ఒక్కో స్థావరంలో ఐదు నుండి ఆరు ఇళ్లు ఉంటాయి. ఈ స్థావరాలకు మొక్కలు, జంతువులు లేదా ప్రదేశాల పేర్లను పెడతారు..
రకరకాల వస్తువులను తయారు చేస్తారు.
అవి కొలంబియా కు ఎగుమతి చేస్తారు.అలా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అతిధులకు వినోదం అందించడానికి లా యొన్న అనే సంప్రదాయ నృత్యాన్ని వాయు ప్రజలు అనుసరిస్తారు. ఈ నృత్యం యొక్క పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మాయిలో చిన్న వయసు నుండి నాట్యం నేర్చుకుంటారు. నాట్యం చేసే సమయంలో వారి వేషధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా వదులుగా ఉండే ఎర్రని రంగు దుస్తులను తల నుండి కాళ్ల వరకూ అమ్మాయిలు ధరిస్తారు. వారు ఓ వైపు తమ చేతులను చాపుతూ, మరో వైపు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు కదులుతారు.