దక్షిణ ఇథియోపియాలో ప్రమాదవ శాత్తు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దారుణ ఘటనలో దాదాపు 71 మంది జలసమాధి అయినట్లు సమాచారం. దక్షిణ ఇథియోపియా దేశంలోని సిదమా రాష్ట్రంలో సోమవారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహా వేడుకకు హాజరైన పెళ్లి బృందం తిరుగు ప్రయాణంలో ట్రక్కులో తమ స్వగ్రామానికి బయలుదేరింది.
గెలాన్ వంతెన వద్దకు రాగానే ట్రక్కు అతివేగం కారణంగా అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 71 మంది అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 68 మంది మగవారు, ముగ్గురు మహిళలు ఉన్నారని సమాచారం. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.