భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ప్రయోగించిన PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఈ ఘనతను సొంతం చేసుకుంది. నిర్దేశించిన సమయంలోగా నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగోవ దేశంగా భారత్ నిలిచింది. ఫలితంగా భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు PSLV C-60 రాకెట్ ప్రయోగం నాంది పలికింది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు స్పేస్ డాకింగ్ టెక్నాలజీ మార్గదర్శనం చేయనున్నది. ఇస్రో ప్రయోగించిన తాజా ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.