నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు.
ఇక మంగళవారం(నేటి) సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం వరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను విరివిగా నిర్వహించనున్నారు.
జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలో పలు పబ్బులు, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు. నగరంలో మందు బాబులు న్యూ సెన్స్ చేసినా, ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.