రోడ్డు పక్కన నడుస్తున్న పాదాచారులపైకి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన నవీ ముంబైలో చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం నవీ ముంబైలోని తలోజా ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
రోడ్డుకు ఎడమవైపున కార్లు వెళ్తుండగా.. అప్పుడే రోడ్డు క్రాస్ చేసి వస్తున్న ఓ మహిళ, పురుషుడి మీదకు స్పీడుగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. వెంటనే కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.