పుష్ప-2 మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా ఒక మహిళ చావుకు కారణమయ్యాడని హీరో అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. మరి ట్యాంక్ బండ్ వద్ద ఇద్దరి మరణానికి కారణమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద సిటీ కమిషనర్ సీవీ ఎందుకు కేసు పెట్టలేదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ప్రశ్నించారు.ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రోగ్రాం పెట్టి ఇద్దరిని కిషన్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు..
అతని మీద కేసు పెట్టడానికి సీవీ ఆనంద్ ఎందుకు భయపడుతున్నాడు.83 కేసులున్న క్రిమినల్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ అని యువతను మోసం చేసి, 49 మంది విద్యార్థుల చావుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి కారణం అయ్యారని బక్క జడ్సన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
https://twitter.com/TeluguScribe/status/1886316489344520440