తెలంగాణ ప్రభుత్వం గతేడాది కులగణన సర్వేను అధికారికంగా చేపట్టిన విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సర్వే ఈ ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి సర్వే నిర్వహించిన అధికారులు అందజేశారు.
ఇదిలాఉండగా, ఈ సర్వే ప్రకారం బీసీలు 46 శాతం ఉన్నట్లు గుర్తించారు. హిందూ, ముస్లిములు కలుపుకుంటే మొత్తం 56 శాతం వరకు బీసీ జనాభా లెక్క తేలింది. కేవలం హిందూ బీసీలే 46శాతం ఉన్నారు. ముస్లిం బీసీలు 10 శాతం వరకు ఉన్నారు. ఇక ఎస్సీలు 17శాతం, ఎస్టీలు 10 ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించి బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలాఉండగా, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై కూడా ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నది. కాగా, ఈ సర్వేకు ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కుల గణన సర్వే కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం అక్షరాల నూట యాభై కోట్ల రూపాయలు! https://t.co/6gDohEdElJ pic.twitter.com/WcxMsNndJb
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025