What is an exit poll: దేశంలో శనివారం తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అయితే చాలా మందికి ఎగ్జిట్ పోల్స్అంటే ఏంటి అనే సందేహాలు ఉంటాయి. పోలింగ్ రోజు బూత్ నుంచి బయటకు వచ్చే ఓటరు నుంచి అభిప్రాయాలు సేకరించడమే ఎగ్జిట్ పోల్.
ఈ సమాచారం ఆధారంగా ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనే అంచనాలు వెలువరిస్తారు. కాగా, 2024 ఎన్నికల ఎగ్జిట్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్నాయి. కాగా, ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. ఊహాగానాలకు, వాదోపవాదాలకు చోటివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ ప్రతినిధి పవన్‌ఖేరా ప్రకటన చేశారు. ఈనెల 4వ తేదీ నుంచి ఏ డిబేట్‌లో పాల్గొనేందుకైనా సిద్ధం అని ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ నిర్ణయం ఓటమిని అంగీకరించినట్టే అని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.