ప్రేమ పేరుతో లవర్ ను తీసుకెళ్లాడు.. లాడ్జిలో మద్యం తాగించి దారుణం !

-

ప్రేమ పేరుతో ఓ మహిళను లోబరుచుకుని… వ్యభిచార గృహాo నిర్వహించే వారికి అప్పగించారు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన తెలంగాణలోని యాదాద్రి లో  చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన ఓ బాలికకు స్థానికంగా ఉండే తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన రాజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇద్దరూ దగ్గరైన తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి గత నెల 22వ తేదీన కారులో తన స్నేహితుడు వినోద్, అవినాష్ సహాయంతో మంగళగిరి నుంచి యాదగిరిగుట్ట కు తీసుకెళ్లారు. అక్కడ ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకున్న రాజేష్ ఆమెకు మద్యం తాగించి లోబరుచుకున్నాడు.

స్థానికంగా వ్యభిచార గృహం నిర్వహించే తన బంధువైన సిరి అనే మహిళ వద్దకు తీసుకెళ్లి బంధించాడు. అయితే వెంటనే తేరుకున్న బాలిక వారి నుంచి చాకచక్యంగా తప్పించుకునీ… డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇక ఇక ఆ బాలిక నుంచి ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version