యూతే ఆ బ్యూటీ టార్గెట్, న్యూడ్ వీడియోలు తీసి !

-

యూత్‌ ను టార్గెట్‌ చేసి.. ఓ యువతి దారుణాలకు పాల్పడింది. రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువతి… న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ సమీపంలోని హాస్టల్ లో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఓ యువతితో పరిచయమైంది.

ఈ క్రమంలో వీడియో కాల్ మాట్లాడిన యువతి కాల్ ను రికార్డు చేసి రూ.10వేలు పంపాలని లేకపోతే దాన్ని న్యూడ్ వీడియో గా మార్చి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తానని డిమాండ్ చేసిందని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బులు పంపితే వీడియో కాల్ ను డిలీట్ చేస్తానని స్పష్టం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ యువతి న్యూడ్ కాల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version