విభజన సమస్యల పరిష్కారంపై నేడు కేంద్ర ఉన్నతాధికారులతో ఏపి అధికారుల ప్రతినిధి బృందం సమావేశం జరుగనుంది. ఇందులో భాగంగానే…ఈ రోజు మద్యాహ్నాం 3 గంటలకు టివి సోమవాధన్ కమిటి సమావేశం జరుగనుంది. విభజన చట్టానికి సంబంధించి పలు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ఆర్ధిక శాఖ ( వ్యయ విభాగం) కార్యదర్శి టివి సోమవాధన్ అధ్యక్షతన కమిటీ ని ఏర్పాటు చేసిన కేంద్రం… పెండింగ్ లో ఉన్న పలు విభజన సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయులు పై ఏపి, సంబంధిత పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనుంది.
ఈరోజు జరిగే ఉన్నతస్థాయు సమావేశానికి ముందస్తుగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయు రెడ్డి అధ్యక్షతన నిన్న ఏపి భవన్ లో ఏపి అధికారుల ప్రతినిధి బృందంతో మూడున్నర గంటల పాటు సమీక్షా సమావేశం జరుగనుంది. ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఏపి అర్ధిక శాఖ కార్యదర్శి రావత్ తో సహా, రాష్ట్ర పరిశ్రమలు, ఆరోగ్యం, విద్యుత్ శాఖల సెక్రటరీ లతో విజయసాయు రెడ్డి అంశాల వారీగా సుదీర్ఘ చర్చలు జరుపనున్నారు.
పోలవరం ప్రాజెక్టు, విభజన తర్వాత ఏపి ఎదుర్కుంటున్న ఆర్ధిక వనరుల కొరత, “జాతీయ ఆహార భద్రతాచట్టం” కింద అర్హుల ఎంపికలో లోపించిన హేతుబద్ధత, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయులు లాంటి తదితర అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.