హైదరాబాద్ పోలీసులకు ఝలక్ ఇచ్చాడు ఓ వాహనదారుడు. బైక్ ఆపారని ఏకంగా.. తన బైక్ ను తగలబెట్టాడు. ఈ ఘటన మైత్రివనం కూడలి దగ్గర చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి గూడకు చెందిన అశోక్ అనే వ్యక్తి.. మైత్రివనం కూడలి వైపునకు వచ్చాడు.
అయితే.. అశోక్ రాంగ్ రూట్ లో వెళ్లడంతో.. పోలీసులు అశోక్ ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్… తన ద్విచక్ర వాహనాన్ని తానె పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో పోలీసులు షాక్ గురయ్యారు. ప్రస్తుతం అశోక్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఇది ఇలా ఉండగా.. ఆపరేషన్ రోప్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ ను హైదరాబాద్ పోలీసులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొత్తం 472 మంది వాహనదారులు, 18 వ్యాపార సముదాయాల యజమానులకు చలాన్లు విధించారు ట్రాఫిక్ పోలీసులు.
రాంగ్ రూట్ లో వచ్చాడు. ట్రాఫిక్ పోలీసులు ఆపారు. పోలీసులు అపినందుకు కోపం వచ్చింది. తన బైక్ లోని పెట్రోల్ తీసి బండి నీ తగల పెట్టారు. అదేమని అడిగితే పోలీసుల మీదకు తిరగ పడ్డారు. పోలీస్ లు అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. @CPHydCity @HYDTP #traffic pic.twitter.com/uhTjNmx1U7
— RameshVaitla (@RameshVaitla) October 3, 2022
A disgruntled Hyderabadi sets his bike on fire after traffic cops stopped him at Mythtivanam junction today. #Hyderabad traffic cops started Operation ROPE (Removal of obstructive parking& encroachments) today. 472 ppl were penalized and 3.65 lakh fines were collected! #Traffic pic.twitter.com/QG0n4PZE4a
— Revathi (@revathitweets) October 3, 2022