ఒకే కుటుంబంలో 9 మందికి ఒమిక్రాన్.. 21కి చేరిన కేసులు

-

దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. తాజాగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి కొత్త వేరియంట్ బారిన పడ్డారు. వీరు కొద్దిరోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. జైపూర్‌లోని ఆదర్శ్‌నగర్‌లో ఉండే ఆ కుటుంబానికి శుక్రవారం కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారి శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌ కోసం అధికారులు పంపించగా ఒమిక్రాన్‌గా తేలింది.

ఆ కుటుంబంతో కాంటాక్టులో ఉన్నవారిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఒమిక్రాన్ బారిన పడిన కుటుంబాన్ని రాజస్తాన్‌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో చేర్పించామని సీనియర్ మెడికల్ అధికారి తెలిపారు. వారితో కాంటాక్టులో ఉన్న ఐదుగురిని గుర్తించి టెస్టు చేయగా, వారికి కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబం, వారితోపాటు సన్నిహితంగా ఉన్న వారితో సహా 34 మందికి టెస్టు నిర్వహించారు. 9 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా తేలింది. మిగతా 25 మందికి నెగెటివ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version