సమోసాలు అమ్ముతూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ కంటే ఎక్కువ సంపాదిస్తున్న కుటుంబం

-

ఈరోజుల్లో చదువుకున్న వాళ్లకంటే.. చదువుకోని వాళ్లే ఎక్కువ సంపాదిస్తున్నారు. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆ కంప్యూటర్‌తో కుస్తీపోట్లు పడ్డా.. నెలాఖరుకు ఖర్చులు పోనీ.. పైసా మిగలడం లేదు. అదే వ్యాపారం చేసే వాళ్లు టైమింగ్స్‌తో పని లేదు.. వాళ్లే బాస్‌, ఇష్టం వచ్చినట్లు పనిచేస్తారు. పైగా నెలకు 50 వేలకు పైనే సంపాదిస్తున్నారు. పానీపూరిబండి వాళ్లు, ఛాయ్‌కొట్టు, మ్యాగీ, న్యూడిల్స్‌ ఈరోజుల్లో వీళ్లదే హవా..! ఒక సమోసాలు అమ్ముతూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తుంది ఓ కుటుంబం. ఈ స్టోరీ వైపు ఓ లుక్కేయండి.!

బీహార్‌లోని లఖిసరాయ్‌ను స్వీట్ల నగరం అంటారు. ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. లఖిసరాయ్‌లోని ఒక దుకాణం సమోసాలకు చాలా ఫేమస్‌.. ఈ సమోసాలు తినేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి క్యూ కడతారు. నగరంలోని పచ్చనా రోడ్డులో ఉన్న సంజయ్ గుప్తా దుకాణంలో గత 10 ఏళ్లుగా భారీ మొత్తంలో సమోసాలు విక్రయిస్తున్నారు. ప్రజలు కేవలం 3 గంటల్లో 1000 కంటే ఎక్కువ సమోసాలను కొనుగోలు చేసుకుని వెళ్తారట.

దుకాణదారుడు సంజయ్ గుప్తా మాట్లాడుతూ, తాను గత 10 సంవత్సరాలుగా ప్రజలకు అద్భుతమైన రుచిగల సమోసాలను తినిపిస్తున్నానని చెప్పారు. స్పైసీ గ్రీన్, రెడ్ చట్నీ సమోసాలతో కలిపి తింటే రుచి వీరలెవల్‌ ఉంటుందట. సమోసా, రుచిలో మంచిదే కాకుండా, మంచి నాణ్యమైన సరుకులను కూడా ఉపయోగిస్తానని సంజయ్‌ గుప్తా తెలిపాడు. ఈ కారణంగా, అన్ని వయస్సుల వారు సమోసాలను ఇష్టంతో తింటారు. అంతేకాకుండా.. ప్యాక్ చేసి ఇంటికి తీసుకువెళతారు. ఇంతకంటే మంచి సమోసా లఖిసరాయ్ జిల్లాలో ఎక్కడా దొరకదని సంజయ్ గుప్తా పేర్కొన్నారు. ఇంట్లో తయారుచేసిన మసాలాలు సమోసా తయారీలో ఉపయోగించటమే ఇక్కడ హైలెట్.

దుకాణంలో ప్రతిరోజూ 1000 కంటే ఎక్కువ సమోసాలు అమ్ముడవుతాయట. సమోసాలను చాలా సింపుల్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇందులో ఇంట్లో తయారుచేసిన స్వచ్ఛమైన మసాలాలతో పాటు కొన్ని రహస్య మసాలాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఉపయోగిస్తారట. ఒక్క సమోసా 10 రూపాయలకే దొరుకుతుంది. సమోసా దుకాణం వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని దుకాణదారుడు సంజయ్ గుప్తా తెలిపారు.

జీవితంలో డబ్బు సంపాదించాలంటే. కేవలం చదువు ఒక్కేట మార్గం కాదు. ఇంకా చాలా దారులు ఉంటాయి. మనం ఏది ఎంచుకున్నాం అనే దానిబట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏం అంటారు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version