హలో… లోకేశ్ గారు… తమరి లొకేషన్ ఎక్కడ? : అంబటి రాంబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కాగా, తమ అభిప్రాయాలను జాతీయ మీడియాకు వివరించేందుకు, జాతీయ నేతలను కలిసేందుకు నారా లోకేశ్ ఢిల్లీలో మకాం వేశారు. పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు అంశాన్ని బలంగా వినిపించడంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, ఏపీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ను అరెస్ట్ చేస్తారని, ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పరారీలో లోకేశ్ అంటూ ప్రముఖ టీవీ చానల్ పేరుమీద ఫేక్ కథనాలు కూడా వచ్చాయి.

అయితే శుక్రవారం కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలడంతో లోకేశ్‌పై మంత్రి అంబటి రాంబాబు చమత్కరించారు. కీలకమైన ట్వీట్ చేశారు. ‘హలో…….లోకేశ్! తమరి లొకేషన్ ఎక్కడ ?’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై వైసీపీ నేతలు ఇంకెక్కడ ఢిల్లీలో అంటూ చెప్పుకొస్తున్నారు. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది లోకేశ్ అని తెలిసే ఢిల్లీలో దాకున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ వాళ్లు మాత్రం ఢిల్లీలో ఉన్నారు ఆమాత్రం తెలియడం లేదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version