ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే,ఆయన పర్యటన సందర్బంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. వ్యక్తిగత సిబ్బంది పక్కనే ఉన్నా ఓ వ్యక్తి కారు మీదకు ఎక్కి మరీ జగన్ భుజాల మీద చేతులు వేసుకుని మద్దుపెట్టుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. జగన్ సైతం ఒకింత షాక్ అయ్యాడు.
దీంతో వెంటనే ఆ వ్యక్తిని వ్యక్తిగత సిబ్బంది అదుపులోకి తీసుకుని వదిలేశారు. అయితే, ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటన శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురంలో జగన్ పర్యటన సందర్బంగా చోటుచేసుకుంది. కాగా, ఆ వ్యక్తి జగన్ వద్దకు వెళ్తుంటే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అతడి కాలు పట్టుకుని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రతిపక్ష నేత, మాజీ సీఎంకు భద్రతను పెంచాలని వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.