కంటెంట్ తో సంబంధం లేని టైటిల్స్ మీద యూట్యూబ్ కత్తి.. వీడియోలు డిలీట్

-

ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ తెలియని వాళ్ళు, యూట్యూబ్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. యూట్యూబ్ పాపులర్ అయినప్పటినుండి ఇంట్లో టీవీలు చూడటం చాలా మంది మానేశారు. వీడియో బ్రౌజింగ్ మొత్తం యూట్యూబ్ లోనే జరుగుతోంది.

అయితే.. యూట్యూబ్ లో కొత్త గైడ్ లైన్స్ రాబోతున్నాయి. కొంతమంది క్రియేటర్లు కంటెంట్ తో సంబంధం లేకుండా అట్రాక్టివ్ థంబ్‍నెయిల్స్ పెట్టి అప్‍లోడ్ చేస్తుంటారు. ఇకపైన అలా చేయడానికి వీలు లేదు.

కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం క్లిక్ చేయాలన్న ఉద్దేశంతో టైటిల్స్ పెట్టిన వీడియోస్ ని యూట్యూబ్ తొలగించనుందట. యూట్యూబ్ కి వచ్చిన వారు.. అనవసర సమాచారంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది యూట్యూబ్.

ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ న్యూస్ సంబంధిత వీడియోల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టనుందట.
బ్రేకింగ్ న్యూస్ అంటూ అట్రాక్టివ్ టైటిల్స్ పెట్టే వారి మీద కొరడా ఝలిపించనుందని సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంటెంట్ కి సంబంధం లేని ఆకర్షణీయమైన టైటిల్స్ ని పెట్టకూడదని క్రియేటర్స్ గుర్తుంచుకోవాలి.

ఇక్కడ ప్రధానమైన అడ్డంకి ఏంటంటే.. కేవలం క్లిక్ చేయడం కోసమే టైటిల్స్ పెట్టిన వీడియోస్ ని ఎలా గుర్తించనుందనేది ప్రధాన సమస్య. మరి ఈ విషయంలో యూట్యూబ్ ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version