బాలయ్యకి ఫోన్ చేసిన అభిమాని.. “అఖండ” జాతర అంటూ !

-

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. హిట్ టాక్ రావడంతో… అఖండ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా అఖండ సినిమాకు క్యూ కడుతున్నారు.

బోయపాటి దర్శకత్వం, నందమూరి బాలకృష్ణ యాక్షన్… ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సౌత్ ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్లోనూ బాలయ్య నటించిన అఖండ మూవీ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా అఖండ సినిమా చూసిన.. ఓ అభిమాని స్వయంగా బాలకృష్ణ కు ఫోన్ చేశాడు. బాలయ్య కు ఫోన్ చేసి.. అఖండ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆ అభిమాని.

” కార్తీకమాసంలో శివుని చూసినట్టు ఉంది. బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు. ఇలాంటి సినిమా చచ్చేవరకు గుర్తుంటుంది. సింహ, లెజెండ్ సినిమాలను మించిపోయింది. మీ అభిమానిగా పుట్టకపోతే ఉంటే నా జన్మ ఏమైపోయాదో అన్నయ్య. అన్ని సెంటర్ల నుంచి ఎవరు ఫోన్ చేసినా సినిమా బాగుంది అంటున్నారు” అంటూ తన ఆనందాన్ని బాలయ్యతో పంచుకున్నాడు ఆ వీరాభిమాని. కరోనా మహమ్మారి పెద్ద సినిమా రావడంతో.. జనాలు బాగా వచ్చారని బాలయ్య సమాధానమిచ్చాడు. మంచి కథలను తెలుగు ప్రజలు ఆదరిస్తారని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version