తండ్రి మందలించి సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో ఓ బాలిక ఆత్మహత్య….!

-

దేశంలో ఆత్మహత్య ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలిసీ తెలియని వయస్సులో టీనేజర్లు చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. మొబైల్​ వాడొద్దని పెద్దలు చెప్పినందుకు, ఓ బాలిక తరుచూ ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుందని తండ్రి మందలించి సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సాపూర్‌ ఎస్సై శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని సునీతాలక్ష్మారెడ్డి కాలనీకి చెందిన జుబేరియా అంజుమ్‌(15) నర్సాపూర్‌ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.

ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం అలవాటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జుబేరియా నిద్రలో నుంచి లేచి సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుతుండగా తండ్రి మహమ్మద్‌ షాబుద్దీన్‌ కూతురిని మందలించి సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. దీంతో జుబేరియా అంజుమ్‌ తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వివరించారు.

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version