రేబిస్ వ్యాధితో ఎంతోమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. తాడిశెట్టి కార్తీక్ (5) తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు అతనిపై దాడి చేశాయి దాడిలో గాయపడిన బారోడిని పలు ఆస్పత్రులలో చూపించారు రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విపరీతంగా క్షమించడంతో కార్తీక్ ను విజయవాడలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా రేబిస్ వ్యాధి సోకినట్లుగా వైద్యులు గుర్తించారు.

చికిత్స కోసం జి.ఎన్.టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి తాడిశెట్టి కార్తీక్ కన్నుమూశారు. కార్తీక్ మరణంతో తన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాలలో కొంతమంది చిన్నారులు కుక్కల దాడిలో మరణించారు. రోడ్లమీద ఉండే కుక్కలకు వైరస్ సోకడంతో ఆ కుక్కలు కరిచిన వెంటనే చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు ఈ విషయం పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంతోమంది ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.