హైదరాబాద్ మహానగరం పరిధిలోని బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాలాపూర్‌లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గౌడౌన్‌లో ఎగసిపడుతోన్న మంటలను చూసిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. అప్పటికీ ఇంకా కార్మికులు ఎవరూ ఆ ప్లాస్టిక్ గౌడొన్‌కు రాలేదని సమాచారం.కాగా, ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.