దయచేసి ఈ సమయంలో ఎవరూ శబరిమలకు రావొద్దని ఓ అయ్యప్ప వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. కేరళలోని శబరిమలలో తుఫాన్ కారణంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని, మాల ధరించిన భక్తులు ఇప్పుడు శబరిమలకు రావద్దని సూచనలు చేశాడు. ఈ వర్షం ఇంకో మూడు నుంచి నాలుగు రోజులు ఉండే చాన్స్ ఉందని, భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని వీడియో సందేశంలో కోరాడు.
తుఫాన్ కారణంగా కొండ చరియల్లో చెట్లు విరిగి పడుతున్నాయని, కొండపై పూర్తిగా ట్రాఫిక్ జాం ఏర్పడిందని, ఈ సమయంతో శబరిమలకు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాల ధరించిన భక్తులు కొంత సమయం ఆగి తుఫాన్ తగ్గాక ప్రయాణాన్ని మొదలు పెట్టాలని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శబరిమల వెళ్లే భక్తులకు అటెన్షన్..
శబరి కి వచ్చే అయ్యప్ప స్వాములు 3,4 రోజులు తర్వాత ప్రయాణం చేయండి. ఇక్కడ తుపాన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. తగ్గినా తర్వాత రావాలని కోరుకుంటున్నాను..#Sabarimala #HeavyRain pic.twitter.com/osxcrawBnl
— Telangana Maata (@TelanganaMaata) December 14, 2024