రివైండ్ 2024 : ఈ ఏడాది మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

-

ఈ సంవత్సరం మార్కెట్లో మంచి మంచి ఎలక్ట్రిక్ బైక్స్ రిలీజ్ అయ్యాయి. చాలామంది ఇంధన బైక్ లకు స్వస్తి చెప్పి ఎలక్ట్రిక్ బైక్ లవైపు వెళుతున్నారు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఎలక్ట్రిక్ బైక్స్ ఏంటో చూద్దాం.

ఓబెన్ రోర్:

చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ బైక్ రైడర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లతో టాప్ రేంజ్ 187 కిలోమీటర్లుగా ఉన్న ఈ బైకు ధర 1,49,999గా(ఎక్స్ షోరూమ్) ఉంది. చూడటానికి స్టైలిష్ గా కనిపించే ఈ బైక్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది.

కొమాకి రెంజర్ XP:

3.6 కిలో వాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్న ఈ బైకు.. ఒకసారి చార్జి చేస్తే 200 నుండి 250 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 80 కిలోమీటర్ల వరకు ఉంది. డబుల్ డిస్క్ కలిగిన ఈ బైక్ ధర 1.86(ఎక్స్ షోరూమ్) లక్షలు గా ఉంది.

అల్ట్రావయొలెట్ F 77 :

7.1 కిలో వాట్ సామర్థ్యం గల బ్యాటరీతో.. టాప్ స్పీడ్ 155 కిలోమీటర్లు గల ఈ బైక్ రేంజ్ 211 కిలోమీటర్ల వరకు ఉంది. జీరో నుండి 100 వేగానికి 7.8 సెకండ్లలోనే చేరుకుంటుంది. దీని బ్యాటరీ వారంటీ ఐదు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్లు గా ఉంది. మార్కెట్లో దీని ధర 2.99 నుండి 3.99 లక్షలుగా(ఎక్స్ షోరూమ్) ఉంది.

రివోల్ట్ RV BRZ :

0 నుండి 75% వరకు చార్జింగ్ మూడు గంటల్లో అవుతుంది. 3.24 కిలో వాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ బైక్.. 80 నుండి 150 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు. ఐదు సంవత్సరాలు బ్యాటరీ వారంటీ కలిగిన ఈ బైక్ ధర 1.04 లక్షలుగా(ఎక్స్ షోరూమ్) ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news