పార్లమెంట్ సమావేశాలు బహిష్కరణకు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కూడా ధాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు. సమావేశాల బహిష్కరణ ప్రకటన తర్వాత మీడియా సమావేశం నిర్వహించాలని నిర్నయం తీసు కున్నారు.
ఈ రోజు ఢిల్లీ నుంచి టిఆర్ఎస్ ఎంపీలు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఒకటి …రెండు రోజుల్లో కార్యాచరణను టిఆర్ఎస్ ఎంపీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటీ నుంచి టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు… ధాన్యం కొనుగోలు పై నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి వచ్చే యాసంగి పంటను కొనాలని డిమాండ్ చేస్తున్నారు టీఆర్ ఎస్ ఎంపీ లు. కానీ కేంద్రం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో.. తెలంగాణ రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది.