పేర్ని నాని గోడౌన్‌లో పీడీఎస్ బియ్యం మిస్సింగ్ కేసులో కీలక పరిణామం

-

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం కనిపించకుండా పోయినట్లు తాజాగా కూటమి( తెలుగుదేశం+ జనసేన+ బీజేపీ) ప్రభుత్వం జరిపించిన విచారణలో బయటపడింది.వందల క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టాయని విచారణలో అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలోనే
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఈ కేసులో అరెస్టు అయ్యి మచిలీపట్నం సబ్ జైలులో ఉంటున్న నిందితులను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో A2, A4, A5లుగా ఉన్న వారిని ప్రత్యేక పోలీస్ వాహనంలో తాలుకా పీఎస్‌కు తరలించారు.
న్యాయవాదుల సమక్షంలో సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిందితులను విచారించి పీడీఎస్ బియ్యం ఎలా పక్కదారి పట్టాయనే సమాచారాన్ని లాగునున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news