ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు తాజాగా కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో ఫ్రీ బస్సు సౌకర్యాన్ని.. ఆగస్టు 15వ తేదీన ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. దీంతో కొన్ని అంశాలు మినహా.. అన్ని బస్సులలో… ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో.. ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కొంతమంది మహిళలు తప్పుదారిన వినియోగించుకుంటున్నారు.

చిన్న చిన్న అవసరాలకు కూడా.. ఫ్రీ బస్సు వినియోగించుకొని రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ బస్సు ముందు నిల్చోని రీల్ కూడా చేసింది. అనంతపురం జిల్లాలో అమ్మకు ఇష్టమైన కట్లపొడి అలాగే ఆకులు తీసుకువచ్చేందుకు ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళ్తున్న అంటూ ఓ మహిళ బస్సు ముందు నిల్చోని…రీల్ చేసి… రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అనంతపురం జిల్లాలో 'అమ్మకు ఇష్టమైన కట్లపొడి, ఆకులు తీసుకొచ్చేందుకు ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళ్తున్నా అంటూ బస్సు ముందు రీల్ చేసిన మహిళ pic.twitter.com/NsiOeWL6fx
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2025