ఏ రోజు పుట్టితే అదృష్టం ఎక్కువగా ఉంటుందో తెలుసా?

-

మన పుట్టినరోజు మన జీవితంలో అదృష్టాన్ని, ఆనందాన్ని అందించాలని మనం కోరుకుంటాం. ఇది అందరికీ జరగకపోవచ్చు. పుట్టినరోజు మన జీవితంలో అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, మన సంస్కృతి ప్రకారం ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో పుట్టిన వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వారం- రోజు ఎలాంటి అదృష్టాన్ని తెస్తుందో మనము తెలుసుకుందాం..

The Secret of Luck Hidden in Your Birth Day

ఆదివారం-సౌర శక్తి : ఆదివారం పుట్టిన వారు సూర్యుని ఆధీనంలో ఉంటారు. వీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కెరియర్, గౌరవంలో అదృష్టం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు.

సోమవారం చంద్రుని శక్తి : సోమవారం పుట్టిన వారు చంద్రుని ప్రభావంతో ఉంటారు. వీరికి ఎక్కువగా భావోద్వేగాలు, వాక్చాతుర్యం, సృజనాత్మకత వీరి సొంతం. ఆర్ట్స్ రంగంలోనూ, రచనలలో రాణిస్తారు.

మంగళవారం అగ్ని శక్తి : మంగళవారం పుట్టిన వారు మంగళ గ్రహం ప్రభావంతో ధైర్యవంతులుగా ఉంటారు. సవాళ్లు ఎదుర్కొనే ధైర్యం వీరి సొంతం. వీరు స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. అంతేకాక సైన్యంలో విజయం సాధిస్తారు.

బుధవారం బుద్ధి తెలివి: బుధవారం పుట్టిన వారు బుధ గ్రహం ఆధీనంలో తెలివైన వారుగా ఉంటారు. ఎలాంటి పని నైనా ఎలాంటి సమస్యనైనా వారి తెలివితో పరిష్కరిస్తారు. వీరు వ్యాపార రంగంలో రాణిస్తారు.

గురువారం గురు ఆశీస్సు: గురువారం పుట్టిన వారు గురు గ్రహం వల్ల జ్ఞానవంతులుగా ఉంటారు. వీరికుండే జ్ఞానాన్ని పదిమందితో పంచి పెడతారు. మీరు విద్యారంగంలో,ఆధ్యాత్మికత రంగాలలో రాణిస్తారు. ఉన్నత ఉద్యోగాలుగా, గురు స్థానం పొందడం వీరి అదృష్టం.శుక్రవారం  సౌందర్యం: శుక్రవారం పుట్టిన వారు శుక్ర గ్రహం ప్రభావంతో ఆకర్షణలుగా ఉంటారు. వీరిని చూస్తే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. వారి మాటలతో, సౌందర్యంతో ఆకట్టుకుంటారు. కళ రంగంలో సినిమా, ఫ్యాషన్ రంగాల్లో రాణిస్తారు.

శనివారం కర్మఫలం : శనివారం పుట్టిన వారు శని గ్రహం వల్ల కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యనైనా వీరి చిటికెలో సాల్వ్ చేయగలుగుతారు. దీర్ఘకాలికంగా మీరు అనుకున్న దాంట్లో విజయాన్ని సాధిస్తారు. ఓపిగ్గా ఉండడం వీరి ప్రత్యేకత.

ప్రతి వారం అదృష్టాన్ని తెస్తుంది. మీ పుట్టినరోజు మీ బలాలను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోండి. కష్టపడే తత్వం మీలో ఉంటే,అదృష్టం మీ వెంటే ఉంటుంది.

(గమనిక: ఇవి పూర్తిగా విశ్వాసపరమైన అంశాలు మాత్రమే, శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల అభిరుచికి అనుగుణంగా ఇక్కడ పొందుపరిచాం.)

Read more RELATED
Recommended to you

Latest news