ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకువచ్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం కింద జనవరి 2025 నుంచి రీ-వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే పెన్షన్ అందజేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కసురత్తులు చేపట్టింది. ముఖ్యంగా ఆగస్టు 25 తో ప్రక్రియ పూర్తికానుంది. ఇది దివ్యాంగుల జీవితాలను ప్రభావితం చేసే కీలక మార్పు గా చెప్పచ్చు. ప్రక్రియ కొత్త నియమాలు మనము తెలుసుకుందాం..
కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెన్షన్ మొత్తం పెంచడం జరిగింది. దివ్యాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 6వేల నుంచి 15 వేల వరకు పెన్షన్ పెంచారు. ఇచ్చే పెన్షన్ వికలాంగుల శాతాన్ని బట్టి ఉంటుంది.
40% కంటే తక్కువ: పర్సంటేజ్40% తక్కువ ఉన్న వికలాంగులకు, దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడం జరగదు. 60 ఏళ్లు పైబడిన వారు అయితే వృద్ధాప్య పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 60 ఏళ్ల లోపు వారైతే వారి వికలాంగత 40 శాతం కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది.
40 శాతం నుంచి 85% వరకు : దివ్యాంగుల పెన్షన్ 40% కన్నా ఎక్కువ ఉంటే 6000 ఇవ్వడం జరుగుతుంది. డిసేబుల్ పెన్షన్ కింద ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
85 శాతం పైబడిన వారు : దివ్యాంగులకు వారి వికలాంగత శాతం 85 శాతం కన్నా ఎక్కువ ఉంటే, వారికి మెడికల్ పెన్షన్ కింద 15 వేల రూపాయలు అందుతుంది. ఈ మార్పులు సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇక గతంలో ఫ్రాడ్ సర్టిఫికెట్స్ తో అనర్హులకు పెన్షన్ తీసుకున్నారు అన్న ఫిర్యాదులు రావడంతో, రీ వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ మార్పులు చేయడం జరిగింది.

రీ వెరిఫికేషన్ ప్రక్రియ : జనవరి 2025 లో ప్రారంభమైన రీ-వెరిఫికేషన్, డిజేబుల్ మెడికల్ పెన్షన్ బెనిఫిషియరీలకు నోటీసులు ఇచ్చారు. వారందరూ విలేజ్ లేదా వార్డు సెక్రటేరియట్లో స్టాఫ్ ద్వారా వెరిఫై చెయ్యమని చెప్పారు. బెడ్ రీడెన్ వారికి హోమ్ వెరిఫికేషన్ జరుగుతుంది.
సర్టిఫికెట్ : డాక్టర్ అప్రూవల్ ను బట్టి కొత్త సర్టిఫికెట్ జనరేట్ చేస్తారు. సుమారు 5 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. నాలుగు లక్షల మందికి పైగా రెస్పాండ్ అయ్యారు మిగతా వారికి ఫైనల్ ఛాన్స్ ఇవ్వనున్నారు. చనిపోయిన వారు మిస్సింగ్ విదేశాలకు వెళ్లినవారు సుమారు మూడు లక్షల మందిని తొలగించనున్నారు.
ఇక సస్పెండ్ అయిన పెన్షన్ లేదా చేంజ్ అయినా పెన్షన్లకు నోటీసులు సెక్రటేరియట్ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసి బెనిఫిషియరీలకు సర్వే చేయాలి. ఈ ప్రక్రియ ఆగస్టు 25 న పూర్తి కావాలి. ఇప్పటికే సస్పెండ్ డీటెయిల్స్ లాగిన్ లో కనిపిస్తున్నాయి.
అప్పీల్ ప్రాసెస్ : సస్పెండ్ అయినట్టు లేదా రిజెక్ట్ చేసినట్టు నోటీసు వచ్చిన 30 రోజుల్లో అప్పీల్ చేయవచ్చు ఎంపీడీవో ఎంసీ కు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి అందుకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్, పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా చేంజ్ చేసిన నోటీస్ పాతా లేదా కొత్త సదరన్ సర్టిఫికెట్, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది సక్సెస్ అయితే పెన్షన్ రీస్టోర్ అవుతుంది.
ఇక చివరిగా ఈ కొత్త నియమాలతో ఏపీ ప్రభుత్వం పారదర్శకత్వం పెంపొందించనుంది. ప్రస్తుతం 62, 81,768 మంది పెన్షన్ తీసుకుంటున్నారు కానీ అనర్హుల తొలగింపుతో కొత్తవారికి అవకాశం వస్తుంది దివ్యాంగులు తమ డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోండి. ఆగస్టు 25 డెడ్లైన్ ని మిస్ అవ్వకండి మరిన్ని డీటెయిల్స్ కోసం దగ్గరలోని సచివాలయం సంప్రదించండి.