ఒక అక్షరం తారుమారై.. భారీ నష్టాలను ఎదుర్కొన్న సంస్థలు ఇవే..! హైఫన్ మిస్సై రాకెట్ కుప్పకూలిందట

-

తొందర్లో తప్పులు చేయటం సహజమే..కానీ కొన్ని సార్లు పొరపాటున చేసే తప్పు వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది..పేపర్ ప్రింటింగ్స్ చూస్తే..కంటెంట్ లో మిస్టెక్స్ ఉన్నా లైట్ తీసుకుంటారేమో కానీ..హెడ్ లైన్స్ లో తప్పు వస్తే..అప్పటివరకూ చేసిన ప్రింటింగ్ అంతా వేస్ట్ అవుతుంది. దీనివల్ల ఆ సంస్థకు ఎంతో నష్టం జరుగుతుంది. ఇక కంప్యూటర్ లో ప్రోగ్రామింగ్ లో ఒక అక్షరం తప్పు టైప్ చేయటం వల్ల నాసాకు చెందిన భారీ రాకెట్ మధ్యలోనే కుప్పకూలిందని మీకు తెలుసా..కేవలం ఒక అక్షరం మూలంగా శతాబ్ధకాలంగా ఉనికిలో ఉన్న సంస్థ మూతపడింది. ఇలా తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కదా..ఇంతకీ ఎలా ఈ సంస్థలు తప్పు చేశాయో..ఆ పరిస్థితి ఏంటో చూద్దాం.

ఒకేలా ఉన్న పేరు..కానీ ఒకటి కాదు

‘టేలర్‌ అండ్‌ సన్స్‌’ అనే ఇంజినీరింగ్‌ వర్క్స్‌ సంస్థకు వేల్స్‌లో మంచి ఆదరణ ఉంది. అయితే, ‘టేలర్‌ అండ్‌ సన్‌’ పేరుతో మరో సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ కార్యకలాపాలు వేరు..అయినప్పటికీ…. దీని మూలంగా టేలర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ మూతపడింది. దీనికి కారణం మరో సంస్థ చేసిన చిన్న తప్పు. కంపెనీస్‌ హౌజ్‌ అనే సంస్థ యూకెలోని వ్యాపారాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. దీనిపని… ఏ సంస్థలు నడుస్తున్నాయి.. ఏ సంస్థలు మూతపడ్డాయనే విషయాలను జాబితా రూపొందించటమే…ఈ క్రమంలో 2009లో ‘టేలర్‌ అండ్‌ సన్‌’ అనే సంస్థ మూతపడగా.. పొరపాటున ‘టేలర్‌ అండ్‌ సన్స్‌’ కంపెనీ మూతపడినట్లు జాబితాలో పేర్కొంది. దీంతో ఆ కంపెనీ మూతపడిందనుకొని కస్టమర్లు రావడం మానేశారు. అలా 124 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ తీవ్రంగా నష్టపోయి ఫైనల్ గా 2014లో నిజంగానే మూతపడింది.

సంఖ్యలు అటు ఇటై..

చిన్న తప్పు వల్ల జపాన్‌కు చెందిన మిజుహొ సెక్యూరిటీస్‌ కంపెనీ 2005లో 225 మిలియన్‌ డాలర్లు నష్టపోయిందట. తప్పు చిన్నదే కానీ..ఫలితం మాత్రం గట్టిగా వచ్చింది.. స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ లిస్టులో మిజుహొ సంస్థ షేర్లలో ఒక్క షేరు 6,10,000యెన్లు అని రాయాల్సిన చోట 6,10,000 షేర్లు ఒక్క యెన్‌గా రాశారు. అంతే షేర్ల కొనుగోలు విపరీతంగా పెరిగింది. తప్పు తెలుసుకున్న సంస్థ షేర్ల కొనుగోలును రద్దు చేయాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ టోక్యో ఎక్స్‌ఛేంజ్‌ రద్దు చేయలేదు. దీంతో మిజుహో కంపెనీకి 225మిలియన్‌ డాలర్లు నష్టం వాటిల్లింది.

కామా(,) తెచ్చిన కష్టం.

ఒక కామా వల్ల మనిషి ప్రాణమే పోయిందని ఇంగ్షీష్ వాకాబ్లరీలో మనకు టీచర్స్ చెప్తూ ఉంటారు. 1872లో అమెరికా ప్రభుత్వం దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌ ట్యాక్స్‌ చట్టానికి సవరణలు చేసింది. ఇందులో భాగంగానే దిగుమతి చేసుకునే పండ్లు, మొక్కల్లో వేటికి ట్యాక్స్ వర్తిస్తుంది.. వేటికి వర్తించదనే జాబితాను సిద్ధం చేసింది. అయితే, ట్యాక్స్‌ వర్తించని జాబితాలో పండ్లమొక్కలు అని రాయాల్సిన చోట.. పొరపాటున పండ్లు, మొక్కలు అని రాశారు. అంతే..వ్యాపారులు ఈ పొరపాటును ఆసరా చేసుకొని పండ్లు, మొక్కలకు ట్యాక్స్‌ లేకుండానే దిగుమతి చేసుకున్నారు. దీనివల్ల అప్పట్లోనే అమెరికా 2 మిలియన్‌ డాలర్లు నష్టపోయిందట.

హైఫన్ మిస్ అయింది..రాకెట్ కుప్పకూలింది

నాసాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో మనందరికి తెలుసు.. 1962లో శుక్ర గ్రహంపై పరిశోధన కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మెరినర్‌-1 అనే రాకెట్‌ను ప్రయోగించింది. కానీ రాకెట్‌ గాల్లోకి దూసుకెళ్లిన ఐదు నిమిషాలకే పేలిపోయింది. ఎందుకలా జరిగిందో పరిశీలించగా కంప్యూటర్‌ కోడింగ్‌లో అక్షర దోషం వల్లేనని తేలింది. రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కోడింగ్‌లో R- అని ఉండాల్సిన చోట కేవలం R మాత్రమే ఉండటాన్ని గుర్తించారు. చేతితో కోడింగ్‌ రాసి తర్వాత దాన్ని కంప్యూటర్‌లో ప్రోగ్రామ్‌ చేసే సమయంలో R అక్షరం పక్కన – హైఫన్‌ పెట్టడం మరచిపోయారు. దీంతోనే రాకెట్‌ ప్రయోగం విఫలమైందట. దీనివల్ల అమెరికాకు అప్పట్లోనే 80 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. వామ్మో ఇంత ఘోరమా అనిపిస్తుంది కదా. చాలామంది టైపింగ్ చేసే సమయంలో చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. అవి పెద్దవే కాకపోయినా తప్పులే కదా..!

పొరపాటున నొక్కిన బటన్..617 బిలియన్‌ డాలర్ల సంపద నాశనం

టోక్యో స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ఓ ట్రేడర్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లో ఒక బటన్‌ నొక్కాల్సింది పొరపాటున షేర్ల కొనుగోలును రద్దు చేసే బటన్‌ నొక్కేశాడు. అంతే ట్రేడింగ్‌లో దాదాపు 42 లావాదేవీలు రద్దయ్యాయి. ఫలితంగా 617 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఈ ఘటన 2014 సెప్టెంబర్‌లో జరిగింది.

మన వర్క్ మొత్తంలో చూసుకుంటూ మనం చేసే తప్పులు చిన్నవిగా అనిపిస్తాయి కానీ..దాని ఫలితం మాత్రం ఔట్ పుట్ లో పెద్దదిగానే ఉంటుంది. అందుకే సంస్థలు క్వాంటిటీ కంటే..క్వాలిటీ మీదే ఎక్కువ దృష్టిపెడతాయి. ఏ పని అయినా కంప్లీట్ చేసే ముందు మళ్లీ ఓ సారి చెక్ చేసుకోవటం ఉత్తమైన మార్గం.

Read more RELATED
Recommended to you

Exit mobile version