ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. న్యూయర్ ముందు రోజు అర్ధరాత్రి గన్నవరం లోని రామరపాడు రింగ్ రోడ్డు వద్ద ఇద్దరు యువకులు బైకు మీద వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాన్ని ఆపారు. సరిగ్గా అదే సమయంలో వెనుకనుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైకుపై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన యువకుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.