గోషామహల్ లో కుంగిన పెద్ద నాల.. తప్పిన పెను ప్రమాదం

-

గోషామహల్ లోని చాక్నవాడి పెద్దనాల కుంగిపోయింది. రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందులో పడిపోయాయి. మార్కెట్లో ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాళాలో పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేయడంతో భారీగా స్థానికులు అక్కడికి తరలివచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే 40 ఏళ్ల క్రితం నాలాపై రోడ్డు వేశారని, ట్రాన్స్పోర్ట్, టింబర్ డిపోల నుంచి లారీలు ఓవర్ లోడ్ తో తిరుగుతుండడమే రోడ్డు కుంగిపోవడానికి కారణమని స్థానికులు అంటున్నారు. దీని గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుంగిపోయిన పెద్దనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తక్కువగా ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పిందన్నారు మంత్రి తలసాని. నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి రూల్స్ పాటించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version