ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు తిట్టుడు నేను ఎక్కడ వినలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సెటైర్లు పేల్చారు. రోషం ఉన్నోడు అయితే బిల్డింగ్ మీద నుండి దూకి చచ్చిపోతుండే.. రేవంత్ రెడ్డి కాబట్టి దుకాణం నడుస్తుందన్నారు కేటీఆర్. పార్టీ వాళ్ళు అయినా కేసులు పెడుతున్నారని తిట్టడానికి ఆలోచిస్తున్నారు.. కాని ప్రజలు సెకండ్ కూడా ఆలోచిస్తలేరన్నారు కేటీఆర్.
సీఎం రేవంత్ నిన్నటి ప్రెస్మీట్లో ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందన్నారు. రాహుల్‌తో తిట్లు పడ్డాక ఎక్కడేం చేయలేక..తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ధైర్యంగా ఉండండి అని కోరారు. ఆరోగ్యం బాలేకపోతే తాము ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పిస్తాం.బీఆర్ఎస్ను సంప్రదించండి’ అని సూచించారు.