ఏటీఎం సెంటర్.. కాదు కాదు జ్యూస్ షాప్.. గుర్తుపట్టండి చూద్దాం..!

-

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం ఎక్కడో జరిగిన విషయాలు కూడా క్షణాల్లో అరచేతిలో వాలిపోతున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియో నే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు అందరూ అవాక్కవుతారు. ఈ వీడియోలు ఏముంది అని అంటారా. ఈ వీడియో లో ఒక ఏటీఎం సెంటర్లు జ్యూస్ షాప్ ఉంది… కాదు జ్యూస్ షాపు ఉన్న దగ్గర ఏటీఎం సెంటర్ పెట్టారు.. ఏంటో మరి అది ఏటీఎం సెంటరా లేకపోతే జ్యూస్ షాపా అన్నది నెటిజన్లకు అర్థం కావడం లేదు.

ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో వెలుగులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఎటిఎం కాస్త జ్యూస్ సెంటర్ గా మార్చేశాడు ఇక్కడ ఒక వ్యాపారి. ఏకంగా లోపల టేబుల్ కుర్చీలు వేసి జ్యూస్ తాగడానికి వచ్చిన కస్టమర్లను ఏసీలో కూర్చోబెట్టి జ్యూస్ ఇస్తూ సపర్యలు చేస్తున్నాడు ఇక ఇది చూసిన స్థానికులు అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు కొంతమంది సదరు వ్యాపారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version