టోల్‌గేట్ దగ్గర కానిస్టేబుల్‌ను స్కూటీతో ఢీకొట్టిన వాహనదారుడు

-

TOLLGATE: టోల్ గేట్ దగ్గర మరో పెను ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దగ్గర వాహనాలు చెక్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను స్కూటీతో వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర జరిగింది.

TOLLGATE
A motorist hit a traffic constable checking vehicles near a tollgate with a scooty

డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసిఫ్ కు మూడు చోట్ల తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అతని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ట్రాఫిక్ పోలీస్ అసిఫ్ ను ఢీ కొట్టింది విశాల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనిపై ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుకు గాయాలు కావడం.. దారుణమైనప్పటికీ… చాలామంది పోలీసులు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని మరికొంతమంది ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news