ముంబైలో నిన్న రాత్రి 2 మోనో రైళ్లు వంతెనపై పక్కకు ఒరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 782 మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి భయాందోళనతో కొన్ని గంటల పాటు నరకయాతన పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో వారందరినీ కిందికి దించారు. ఈ ఘటనలో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రైళ్లలో కెపాసిటీకి మించి జనం ఎక్కడం వల్లనే పవర్ సప్లై నిలిచిపోయి రైళ్లు ఎక్కడికి అక్కడే ఆగిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వరదలతో 24 మంది మరణించారు. ముంబై మహానగరంలో మరో 48 గంటల పాటు మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారి ప్రాణాలను కాపాడుకోవాలని సూచనలు జారీ చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితులలోను బయటకు రాకూడదని సూచించారు.