జెపి తుమినాడ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “సు ఫ్రమ్ సో”. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా కన్నడలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా తీశారు. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తీయగా ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా రికార్డులు తిరగరాసింది.

అనంతరం ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 9 నుంచి జియో హాట్ స్టార్ లో స్క్రీనింగ్ కానుంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ నెల 9 నుంచి హాట్ స్టార్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. దీంతో సినీ ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు.