భార్య భర్తల సంబంధం ప్రేమ,నమ్మకం, గౌరవం అనే మూడు స్తంభాలపైన ఆధారపడి వుంటుంది. ఈ బంధంలో చిన్న చిన్న గొడవలు విభేదాలు రావడం సర్వసాధారణం కానీ కొన్ని మాటలు పదేపదే గాయం చేస్తాయి. అవి భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. భార్య తమ భర్తతో చెప్పే కొన్ని మాటలు వారి మనస్సును ఎంతగానో బాధపడతాయి. ఏ భార్య కూడా కావాలని ఇలాంటి మాటలు చెప్పకపోయినా కోపంలో లేదంటే నిస్సహాయతతో మాట్లాడే ఈ మాటలు భర్తను గాయపరుస్తాయి. మరి ఆ మాటలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఏ పనికి సరిపోరు : ఈ మాట భర్త ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తి తన కుటుంబానికి ఆర్థికంగా, మానసికంగా అండగా ఉండాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో మీరు ఏ పనికి సరిపోరు అనే మాట వారి ప్రయత్నాలను కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తుంది. ఇది వారి మనసులో తీవ్రమైన బాధను కలిగిస్తుంది.
మీ తల్లిదండ్రులు మాట వినద్దు : పెళ్లయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు తమ తమ కుటుంబాల గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటారు. కానీ భర్త తమ తల్లిదండ్రుల పట్ల చూపే ప్రేమను, బాధ్యతను మీరు ఎప్పుడు మీ తల్లిదండ్రులు మాటే వింటారు అంటూ తప్పు పడితే అది భర్త మనసును గాయపరుస్తుంది. తల్లిదండ్రులకు భార్య కు మధ్య ఎవరిని ఎంచుకోవాలో తెలియని అయోమయ స్థితిలో సృష్టిస్తుంది.

ఇతరులతో పోల్చడం: ఇది భర్తను ఇతరులతో పోల్చి చూడడం తో మొదలవుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలు లోపాలు ఉంటాయి. ఇతరులతో పోల్చి చూడడం వల్ల వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూసినట్లు అవుతుంది. ఈ పోలిక భర్తలో నిరాశను అసమర్థత భావనను పెంచుతుంది.
మీరు నాకు ఏమీ ఇవ్వలేరు : ఇది ఆర్థికపరమైన మాట చాలా సందర్భాల్లో భార్యలు కోపంలో లేదా నిరాశతో ఈ మాట అంటారు. ఈ మాట భర్త తన కుటుంబానికి అవసరమైనవన్నీ అందించడం విఫలం అయ్యారానే భాద కలిగిస్తుంది.
మీరు మారరు : సంబంధం లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఇద్దరు కలిసి కృషి చేయాలి. కానీ మీరు మారరు అనే మాటతో భార్య ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఈ మాట భర్తపై తమకు నమ్మకం లేదని సూచిస్తుంది. ఇది భర్తలోని నిస్సహాయత భావాన్ని పెంచుతుంది.
ఈ 5 మాటలు భార్యలు కోపంలోనూ, నిరాశలోను పలికిన అవి భర్తల మనసును తీవ్రంగా గాయపరిస్తాయి సంబంధం లో గౌరవం పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఈరోజుల్లో జంటలు తొందరగా విడిపోవడానికి కారణమయ్యే మాటలు కూడా ఇవే అవుతున్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. చిన్నపాటి ప్రశంసలు, ప్రేమతో కూడిన మాటలు సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. చిన్నచిన్న గొడవలకే సమస్యను పెద్దది చేసుకోకుండా ప్రేమతో కలిసి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.
గమనిక: పైన పేర్కొన్న విషయాలు సాధారణంగా జరిగే సంఘటనలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి సంబంధం విభిన్నంగా ఉంటుంది.