లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు జిల్లాలలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 10, 11వ తేదీలలో భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాలలో కేటీఆర్ పర్యటించనున్నారు. 13న గద్వాలలో పర్యటిస్తారు. దసరా పండుగ లోపు వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించాలని కేటీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.

మరోవైపు స్థానిక సంస్థలతో పాటు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కేటీఆర్ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా… గులాబీ పార్టీలో ఇటీవల కలకలం చోటు చేసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరించారు కేసీఆర్. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసినందుకు కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి పీకిపారేశారు. పార్టీకి నష్టం జరిగేలా కన్న కూతురు తప్పు చేసినా కూడా క్షమించేది లేదన్న విధంగా కేసీఆర్ స్పందించి యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ జిల్లాలలో పర్యటనకు వెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.