అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ.. బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం మహిళ

-

హిందువుల చిరకాల స్వప్నం అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సందర్భంగా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఒక గొప్ప పండుగ లాగా ఈ వేడుకను జరుపుకున్నారు. ఇక అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన ముహూర్తం మంచిదని భావించిన చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన పనులను చేసుకున్నారు. ఇక గర్భిణీలు తాము అయోధ్యలో రాముడు కొలువు దీరనున్న సమయంలోనే ప్రసవించాలని పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ.. తనకు పుట్టిన బిడ్డకు హిందూ, ముస్లిం మతాలకు సంబంధించిన పేర్లు రెండు కలిపి పెట్టింది.

ఉత్తరప్రదేశ్ – ఫిరోజాబాద్‌లో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఫర్జానా అనే మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. హిందూ-ముస్లిం ఐక్యతను సూచించే విధంగా శిశువు బామ్మ హుస్నా బాను తన మనవడికి రామ్ రహీమ్ అని పేరు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news