గత కొద్ది రోజుల నుంచి ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 3.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నానికి 5 లక్షలు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకి వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికారులు మధ్యాహ్నం లోపే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

లంక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరిస్తోంది. కాగా, గత కొద్ది రోజుల నుంచి తెలుగు, రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఇక మరో రెండు మూడు రోజులపాటు మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
35 gates were raised by 7 feet today
PRAKASAM BARRAGE VIJAYAWADA pic.twitter.com/QIsCRcP3Zq— 🐦🔥 🅾️G 🐦🔥 (@iamhemuk) August 31, 2024