తెలంగాణ రాష్ట్రానికి చెందిని ఓ యువకుడు ఛాతీ సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రి వారి నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు చనిపోయాడు. చనిపోయే ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకొని అందులో ఆసుపత్రి వారు చేసిన నిర్లక్ష్యాన్ని వివరిస్తూ బాయ్ డాడి నేనీ చనిపోతున్నాను అని చెబుతున్నాడు ఆ వీడియో వ్యవది కేవలం 25 సేకన్లే అయినా అది చూసిన వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఆ వీడియోను ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో సంచలనాన్ని రేపుతుంది.
వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు కొంత కాలంగా ఛాతీ సమస్య తో బాధపడుతున్నాడు, తన తండ్రి ఆ యువకుడిని పట్టుకొని దాదాపుగా 11 ఆసుపత్రుల్లో తిరిగారు. ఏ ఆసుపత్రి వారు అతనిని అడ్మిట్ చేసుకోలేదు, చివరికి 24 తేదీన ఎర్రగడ్డ లోని ఛాతీ ఆసుపత్రి లో జాయిన్ చేశారు.. ఛాతీ సంశయ కాబట్టి ఊపిరి తీసుకోడానికి ఇబ్బంధి ఉండటంతో ఆసుపత్రి వారు 26 తేదీ వరకు ఆక్సిజన్ అందించారు. తరువాత ఆ యువకుడు ఎంత బ్రతిమిలాడినా గోడు పెట్టుకున్నా ఆ యువకుడికి ఆక్సిజన్ అందించలేదు. దీంతో ఆ యువకుడికి తాను చనిపోతున్నట్టుగా అర్థమయ్యి సెల్ఫీ వీడియో తీశాడు, ఆ సెల్ఫి వీడియో లో… ‘నేనేం చెప్పిన డాడీ.. చంపేస్తారు డాడీ. పోతే రిటన్ రాను డాడీ అని చెప్పిన గదా. ఊపిరి ఆడడం లేదంటే కూడా చెప్తే వినకుండా ఆక్సిజన్ బంద్ చేశారు. బితిమిలాడి బతిమిలాడి సాలు సాలు (విసుగు) అవుతుంది. ఇప్పటికి మూడు గంటలు అయింది డాడీ. నాకు ఊపిరి అడతలేదు. గుండె ఆగిపోయింది. ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుంది డాడీ. బాయ్ డాడీ బాయ్. అందరికీ బాయ్ డాడీ.’ అంటూ చెబుతున్నాడు. చివరికి ఆ యువకుడు తుది శ్వాస విడిచాడు. ఆ వ్యక్తి చనిపోయిన తరువాత 30 మంది అంత్యక్రియలకు పాల్గొన్నారు అంత్యక్రియ అనంతరం టెస్ట్ రిపోర్టులు రాగా ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ వీడియోను చూసిన ఎంపీ రేవంత్ రెడ్డి తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ఆ వీడియోను పోస్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం ఇదే అంటూ తెలంగాణ ఆసుపత్రి వారే చంపేశారంటూ తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశాడు ఇప్పుడు ఆ వీడియో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపుతుంది
కరోనా బాధితుడి పట్ల ప్రభుత్వ బాధ్యతారహిత విధానానికి పరాకాష్ట ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలోని ఈ సంఘటన @TelanganaCMO @TelanganaHealth @ts_health @Eatala_Rajender @ICMRDELHI pic.twitter.com/1nS43rJBDK
— Revanth Reddy (@revanth_anumula) June 28, 2020