రైలు పట్టాలపై నిద్రిస్తున్న వ్యక్తి.. లోకో పైలట్ ఏం చేశాడంటే?

-

ఇటీవల రైల్వే ట్రాకులపై కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కొందరు సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటే మరికొందరు రైల్వే ట్రాకులపై బండరాళ్లు, ఇనుప రాడ్లు, సిలిండర్లు పెట్టి ప్రయాణికులను, రైల్వే అధికారులను కలవరానికి గురిచేస్తున్నారు. ఈ పనుల వలన అటు ప్యాసింజర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రైల్వేకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది.

తాజాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్‌పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న ఆ వ్యక్తిని లోకో పైలట్‌ సకాలంలో గుర్తించి బ్రేకులు వేసి అతని ప్రాణాలను కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గొడుగును అడ్డుపెట్టుకుని మరీ ఆ వ్యక్తి రైలు పట్టాలపై సాఫీగా నిద్రిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news